బ్రహ్మముడి కావ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. రోజుకి అంత తీసుకుంటుందా!

by Kavitha |   ( Updated:2024-05-01 10:27:34.0  )
బ్రహ్మముడి కావ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్..  రోజుకి అంత తీసుకుంటుందా!
X

దిశ,సినిమా: బ్రహ్మముడి సీరియల్‌తో ఫేమ్ అయిన కావ్య మన అందరికీ సుపరిచితమే. ఈమె అసలు పేరు దీపిక రంగరాజు. ఈమె అనేక ఈవెంట్స్, షోలలో పాల్గొని తన మాటలతో, డాన్స్‌లతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. బ్రహ్మముడి సీరియల్ తక్కువ సమయంలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా ‘ బ్రహ్మముడి ‘లో కావ్య పాత్ర బాధ్యత గల భార్యగా… పుట్టింటి, అత్తింటి గౌరవాన్ని నిలబెట్టే పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల స్టార్ మా అవార్డ్స్ లో దీపిక కి బెస్ట్ డాటర్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే.

బ్రహ్మముడి సీరియల్ కి గాను దీపిక రంగరాజు గట్టిగానే రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందట. బ్రహ్మముడి సీరియల్ నిర్మాతలు ఆమెకు రోజుకు సుమారు రూ. 25 వేల రూపాయల రెమ్మ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. నెలకు కనీసం 25 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది. కాబట్టి బ్రహ్మముడి సీరియల్ ద్వారా దీపిక రంగరాజు నెలకు రూ. 6.25 లక్షల రెమ్యూనరేషన్ రాబడుతుంది . అంతేకాదు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది. పలు స్పెషల్ ఈవెంట్స్, షోలలో సందడి చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

Read more : బ్రహ్మముడిలో రుద్రాణి పాత్రకు పారితోషికం ఎంతంటే..షర్మిత గౌడ రోజుకు అంత తీసుకుంటుందా?

Advertisement

Next Story