మహేష్ బాబు వేసుకున్న లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం..

by Hamsa |
మహేష్ బాబు వేసుకున్న లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం ‘SSMB28’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు షూటింగ్‌ నుంచి కాస్త గ్యాప్ దొరికినా ఫ్యామిలితో కలిసి వెకేషన్‌కు వెళతారు. ఎక్కువగా తమ ఫ్యామిలితో ఫారన్ కంట్రీస్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా, మహేష్ బాబు ట్రిప్‌కు వెళ్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాకు కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మహేష్ బాబు తన భూజానికి కాస్ట్లీ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ ఎమ్ఎమ్ బ్యాగ్‌తో కనిపించారు. దీంతో ఆ బ్యాగ్ ధరపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ బ్యాగ్ ధర 3,92,656 రూపాయలు. మీరు చదివింది నిజమే. దీని ప్రత్యేకత ఏంటంటే స్టైల్ పరంగా మాత్రమే కాదు.. సొగసైన డిజైన్‌తో, విశాలమైన కంపార్ట్‌మెంట్లను ఈ బ్యాగ్ కలిగి ఉంటుందట. ఈ బ్యాగ్ ధర విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story