- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Balagam :బలగం మూవీలో పోషవ్వ నిజ జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు
దిశ, వెబ్‌డెస్క్ : కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం సినిమా ఎవరూ ఊహించని విధంగా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మూవీలో ప్రతి ఒక్కరూ తమ ప్రాతను ప్రాణం పెట్టి పోషించారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ప్రతి చిన్న పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
మరీ ముఖ్యంగా సినిమాలో కొమురయ్య చెల్లి, పోషవ్వ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు అన్న చనిపోయాడని బాధపడుతూనే, మరో వైపు సూటి పోటి మాటలంటూ, గొడవలకు కారణం అవుతుంది. ఈ మూవీలో పోషవ్వ పాత్ర ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే తాజాగా పోషవ్వ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని కొన్ని విషాదకర సంఘటలను అభిమానులతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. తన భర్త చనిపోయిన నాలుగేళ్లకే చిన్న కొడుకు చనిపోయాడని, చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయేటప్పటికీ, తన కోడలు గర్భవతి, అది నా జీవితంలో మర్చిపోలేని విషాదం. ఓ వైపు భర్త దూరమవ్వడం, మరో వైపు కన్న కొడుకు దూరం అవ్వడం ఇవన్నీ తనను మానసికంగా ఇప్పటికీ కలవర పెడుతాయి అని తెలిపింది. ఇప్పటికీ ఆ బాధ నుంచి నేను కోలుకోలేకపోతున్నాను, అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది, పోషవ్వ పాత్ర చేసిన విజయ లక్ష్మీ.
Read more:
Shaakuntalam : ‘శాకుంతలం’ సినిమాపై అల్లు అర్జున్ ఆసక్తికర పోస్ట్..