ఒంటరిగా కనిపిస్తే చంపేస్తాం.. ‘ది కేరళ స్టోరీ’ నటీనటులకు హెచ్చరిక

by Prasanna |   ( Updated:2023-05-09 09:06:20.0  )
ఒంటరిగా కనిపిస్తే చంపేస్తాం.. ‘ది కేరళ స్టోరీ’ నటీనటులకు హెచ్చరిక
X

దిశ, సినిమా: అదా శర్మ ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’. గత కొంత కాలంగా కేరళలో అమ్మాయిలను, మతం మార్పిడి ద్వారా ఉగ్రవాద సంస్థల్లోకి తీసుకెళ్తున్నారనే ఆరోపణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుదీప్తో సేన్. తాజాగా రిలీజైన ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. నిషేధించాలన్న నిరసనల మధ్య కూడా అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. ఇదిలా ఉంటే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటోంది మూవీ యూనిట్. ‘మీరు చేసింది ఏమంత మంచి పని కాదు. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లే సాహసం మాత్రం చేయొద్దు’ అని హెచ్చరికలు వస్తున్నట్టు దర్శకుడు సుదీప్తో సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారికి భద్రత కల్పించారు.

Also Read..

OTTలో ‘ది కేరళ స్టోరీ’

Advertisement

Next Story