నటిని కాకపోతే.. ఆ పని చేసేదాన్ని: జాన్వీ

by sudharani |   ( Updated:2023-04-23 13:16:17.0  )
నటిని కాకపోతే.. ఆ పని చేసేదాన్ని: జాన్వీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ‘ఎన్టీఆర్30’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తాను నటి కాకపోయుంటే ఏం చేసేదో చెప్పింది. ‘సినిమాల్లోకి రాకపోతే రోడ్ల మీద పడి ప్రపంచమంతా చుట్టేస్తూ.. కొత్త వ్యక్తుల్ని కలిసేదాన్ని. అది కుదరకపోతే రచయిత్రిగా మారేదాన్ని. వాయు కాలుష్యానికి దూరంగా చుట్టూ పచ్చని వాతావరణం ఉంటే చాలా ఇష్టం. అందుకోసం ఎక్కువగా మాల్దీవులకు వెళ్తుంటాను. ప్రశాంతత కోసం మూడు నెలలకు ఒకసారైనా తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుంటా’ అని తెలిపింది.

Also Read..

కెరీర్ విషయంలో ఎవరి మాట వినను: సిమ్రాన్

Advertisement

Next Story