- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లయి పిల్లలు ఉంటే ఇంట్లోనే ఉండాలా..? అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్
దిశ,సినిమా: అనసూయ భరద్వాజ్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న ఆమె తాను పెట్టే పోస్టుల వల్ల తరచు ట్రోలింగ్ కి గురవుతుంది. నిత్యం పెళ్ళైంది కదా భర్త పిల్లలతో చక్కగా ఉండకుండా ఈ ఎక్సపోజింగ్ ఏంటి .. ఈ వయసులో నీకు అవసరమా అంటూ విమర్శిస్తుంటారు. తన హేటర్స్ కి ఎప్పటికప్పుడు గట్టిగానే బుద్ధి చెప్తుంది అనసూయ. అలాగే అనసూయ ఆడవారికి అన్యాయం జరిగితే ఊరుకోదు కచ్చితంగా ప్రశ్నిస్తారు.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ 60 ఏళ్ల మహిళ అందాల పోటీల్లో పాల్గొని మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకుంది. ఈ వీడియో ని ఉద్దేశిస్తూ అనసూయ ఓ కామెంట్ చేసింది. ఆమెను విమర్శించే ఎంతోమందికి ఈ వీడియో సమాధానం అని పేర్కొంది.
బాడీ షేమింగ్ కి పాల్పడేవారిని ఉద్దేశిస్తూ ఆడవాళ్ళకి పెళ్లయింది అని, పిల్లలు ఉన్నారని, 30 ఏళ్ళు దాటాయిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేస్తారు. ఇంట్లోనే ఉండొచ్చుగా అంటూ విమర్శించే వారికి ఇది సమాధానం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.