Richa Panai: సినిమా అవకాశాలు లేక.. ఆ పని చేసుకుంటున్న హీరోయిన్?

by Prasanna |
Richa Panai: సినిమా అవకాశాలు లేక.. ఆ పని చేసుకుంటున్న హీరోయిన్?
X

దిశ, సినిమా: కొంతమంది చిన్న హీరోయిన్‌లు అందం, ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేరు. ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. టాలీవుడ్ నటి రిచా పనయ్. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రిచా.. చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాలలో కూడా నటించింది. కానీ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే తాజాగా రిచా పనయ్ హైదరాబాద్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను కరోనా లాక్‌డౌన్‌లో రెండు సినిమాలు చేశాను. అవి ఎప్పుడు విడుదల అవుతాయా అని ఎదురు చూస్తున్నాను. అందులో ఒకటి శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘బృందావనమది అందరిది’ సినిమా కాగా, రెండోది నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ రెండు మూవీస్ పైనే హోప్ పెట్టుకున్నా.. ఇవి క్లిక్ అయితే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని అనిపిస్తుంది. అన్ని రోజులు మనవి కావు.. సినిమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయనే నమ్మకం లేదు. అందుకే ప్లాన్ చేసి క్యాట్ కాఫీ స్టూడియోను స్టార్ట్ చేశాను. చక్కగా బిజినెస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా ఫోకస్ అంతా దానిపైనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed