చరణ్ కాదన్నా గ్లోబల్ స్టార్ నువ్వే.. మంచు విష్ణుపై సెటైర్లు! మళ్లీ ఏం చేసాడంటే?

by Anjali |   ( Updated:2023-03-31 08:29:06.0  )
చరణ్ కాదన్నా గ్లోబల్ స్టార్ నువ్వే.. మంచు విష్ణుపై సెటైర్లు! మళ్లీ ఏం చేసాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఈ మధ్య కాలంలో విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై డిస్కషన్స్, ట్రోలింగ్స్ తెగ జరుగుతున్నాయి. రీసెంట్ గా మంచు మనోజ్‌ నెట్టింట షేర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అయిన విషయం విదితమే. కాగా.. నిజంగానే వీరి మధ్య గొడవలు ఉన్నాయా? లేక నటిస్తున్నారా? అనేది కూడా కొందరు అనుమానం వ్యక్తం చేసారు. ప్రస్తుతం మంచు విష్ణు అదే వీడియోను ప్రస్తావిస్తూ మరో వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో విష్ణు చేస్తున్న ఓ రియాలిటీ షోకు సంబంధించిన కంటెంట్‌ ఉంది. ఇందులో మంచు కుటుంబం ఇంటిని, కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడాన్ని చూడొచ్చు. ఇదొక రియాలిటీ షోకు సంబంధించిందనే అర్థం వచ్చేలా వీడియోను ముగించారు. దీనికి ‘హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌’ అని పేరు పెట్టారు. త్వరలోనే ఇది ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇటీవల మనోజ్‌ పోస్ట్‌ చేసిన వీడియో కూడా దీనిలో భాగమే అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మంచు అన్నదమ్ములు పోస్ట్‌ చేసిన వీడియోలను కొంతమంది సరదాగా తీసుకున్నా.. కొందరైతే మండిపడుతున్నారు. ‘ఆడుకోవడానికి మేమే దొరికామా..? మమ్మల్ని ఫూల్స్‌ చేస్తారా..?’ అంటూ, మరికొందరు.. ఎందుకన్నా ఇవన్నీ... అసలే ట్రోలర్స్‌ ఆకలితో ఉన్నారు.. ఆడేసుకుంటారు. నీ ఫ్యాన్‌గా చెబుతున్నా.. ఇలాంటివి వద్దు.. ఇక నీ ఇష్టం.. లేదంటే ట్రోలర్స్‌కి బిర్యాని అయిపోతావ్‌’’ అని పోస్ట్‌ చేశారు. ఇవన్నీ ఒకెత్తు అయితే మరొ వ్యక్తి... నువ్వు తోపున్నా .. నీ ఐడియా సూపర్ అన్నా, ‘రామ్ చరణ్ కాదు గ్లోబల్ స్టార్’ నువ్వే అంటూ వెటకారం చేస్తూ.. వీడియో కింద కామెంట్లు రాస్తున్నారు. ఇక ‘మీ మధ్య ఎన్ని ఉన్నా.. ఈ వయసులో పెద్దయనను ఇబ్బంది పెట్టొద్దని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా డ్రామా అంటూ మండిపడుతున్నారు. ఇకనైనా నెటిజన్స్‌తో సిల్లీగా ప్రవర్తించవద్దంటూ దుయ్యబడుతున్నారు.

ఇవి కూడా చదవండి: Priyanka Chopra: అతనితో డేటింగ్ చేయాలంటే భయమేసింది.. ప్రియాంక

Advertisement

Next Story

Most Viewed