Sreeleela : కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను.. శ్రీలీల !

by Kavitha |   ( Updated:2024-03-09 14:25:56.0  )
Sreeleela : కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను.. శ్రీలీల !
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అనతి కాలంలోనే వరుస ఆఫర్లు అందుకుంటూ సెన్సేషన్‌గా మారింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో వచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతే డిజాస్టర్‌లు కూడా అందుకుంది. దీంతో కొద్దిరోజులుగా ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు. అలా గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. ‘భగవంత్‌ కేసరి’ మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ ఏడాది ‘గుంటూరు కారం’ సినిమాతో మెప్పించిన.. అది కూడా యావరేజ్‌గానే మిగిలింది. దీంతో కొద్దిరోజులు బ్రేక్‌ తీసుకుంది శ్రీలీల. ఈ క్రమంలోనే భారీ ఆఫర్లు వస్తున్నప్పటికీ సింపుల్‌గా నో చెప్పేస్తుందట.

అయితే శ్రీ లీల మల్టీ టాలెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఆమె డ్యాన్సుకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ ఉంది. అందుకని తాజాగా స్పెషల్‌ సాంగ్స్‌లో చేయాలని కూడా శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నాయట. ఇటీవల ఓ స్టార్‌ హీరో సినిమాలో శ్రీలీలతో ఐటెం సాంగ్‌ చేయించాలని మేకర్స్‌ భావించి ఆమెను సంప్రదించారట. భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ కూడా ఆఫర్‌ చేశారట. కానీ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ టైం లో కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్‌ చేయనని చెప్పేసిందట శ్రీలీల.

Advertisement

Next Story

Most Viewed