- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా బాడీ సైజుల గురించి దారుణంగా ట్రోల్స్ చేశారు : అనన్య
దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొందట. ఆ ట్రోల్స్ కారణంగా ఒకానొక సమయంలో తనకు తాను ఆత్మ విశ్వాసం కోల్పోయిందట. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది యంగ్ బ్యూటీ. ‘నేను ఇప్పటికీ నా శరీరం గురించి బాధ పడలేదు. కానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నన్ను మగాడిలా ఫ్లాట్ గా ఉన్నావు. నీ బాడీ షేప్ అబ్బాయిలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వారసత్వం ఉందని అబ్బాయిలా ఉన్న నువ్వు కూడా హీరోయిన్ గా రాబోతున్నావా అంటూ అవహేళన చేశారు. ఆ సమయంలో నేను పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. అలా పిచ్చివాగుడు వాగేవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నటి ఇలాంటి కామెంట్స్ కచ్చితంగా ఎదుర్కొంటుంది. అందుకే నన్ను నేను క్రూరంగా మార్చుకున్నా.. ఇలాంటి మాటలు మాట్లాడే వారిని బ్లాక్ చేసి పడేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.