- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను లైంగికంగా వేధించారు.. సినీ నటుడి ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటులు వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న వేధింపుల గురించి అప్పుడప్పుడు మీడియా ముందు ప్రస్తావిస్తుంటారు. కొంతమంది తమను వేధించిన ప్రముఖుల పేర్లు ధైర్యంగా మీడియా ముందు బహిర్గతం చేస్తారు. ఇదిలా ఉంటే.. తాను ఏడో తరగతి చదివే సమయంలో తన బంధువుతో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చాడు బాలీవుడ్ నటుడు.
బాలీవుడ్ సినీ నటుడు, రచయిత, నేపథ్య గాయకుడు పియూశ్ మిశ్రా గురించి అందరికి తెలిసిందే. అక్కినేని నాగార్జున ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమైన పియూశ్ తాను చిన్న తనంలోనే వేధింపులకు గురయ్యాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పియూశ్ మాట్లాడుతూ.. ‘‘శృంగారం అనేది ఒక అందమైన అంశం. మొదటిసారి అనుభవం ఎంతో అద్భుతంగా ఉండాలి. లేదంటే అది మీ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. నా జీవితంలో కూడా ఇలాంటి ఓ చేదు అనుభవం ఉంది. నేను చిన్న తనంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఆ విషయం నన్ను ఎంతో కష్టపెట్టింది. దీంతో ఆ ఘటన నుంచి నేను బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. నాపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారి గురించి నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే వారు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డ ప్రముఖులు. అయితే నేను ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఇదే విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ పుస్తకంలో కూడా పొందుపరిచాడు పియూశ్.
ఇవి కూడా చదవండి :