- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు తెలుగు నటుల్లో వాళ్ళంటేనే చాలా ఇష్టం.. కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన ‘సత్యభామ’ సినిమాతో రాబోతుంది.
తాజాగా ఆ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ బ్యూటీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. అందులో నాకు కొంత మంది అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సమంత అంటే నాకు చాలా ఇష్టం అని కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
కాగా రామ్ చరణ్ హీరోగా నటించిన‘ గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బృందావనం’ సినిమాలో కాజల్ , సమంత ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు.