- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Allu Arjun: అల్లు అర్జున్ పై 'గబ్బర్ సింగ్' నటుడి సంచలన కామెంట్స్! ఫ్యాన్స్‌ను కొడతాడంటూ..
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పుష్ప’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రస్తుతం ఈ మూవీకి సీక్వేన్స్‌గా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఏపీ ఎలక్షన్స్ టైం నుంచి బన్నీకి బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పిఠాపురం నుంచి తన సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బన్నీ పవన్‌కు సపోర్ట్ చేయకుండా వైసీపీ నుంచి పోటీ చేసిన తన ఫ్రెండ్‌కి సపోర్ట్ చేశాడు. ఇక అప్పటి నుంచి నిత్యం ట్రోల్స్‌కి గురౌతునే ఉన్నాడు. ఈ క్రమంలోనే హీరో సాయిధరమ్ తేజ్, సోషల్ మీడియాలో అకౌంట్లలో అల్లు అర్జున్‌ని, ఆయన సతీమణి స్నేహా రెడ్డిన అన్ ఫాలో చేయడం, నాగబాబు 'మనవాడు - పరాయివాడు' అంటూ ట్వీట్ చేయడం, మెగా డాటర్ నిహారిక కూడా గొడవలు నిజమేనంటూ తేల్చి చెప్పడం వంటి వరుస సంఘటనలతో అల్లు అర్జున్‌కి యాంటీగా అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న 'గబ్బర్ సింగ్’ ఫేమ్ సాయిబాబా అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు.. ఆయన మాట్లాడుతూ.. 'పుష్ప 2 సినిమాలో నాకు అవకాశం వచ్చి ఉండేది. కానీ, అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా చేయను.. ఎందుకంటే అతని ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు.. అల్లు అర్జున్, తన అభిమానులను తన్నడం, కొట్టడం చాలా సార్లు చూశాను.. అభిమానులంటే అతనికి ఏ మాత్రం గౌరవం లేదు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా, ట్రోల్ చేసినా సరే ఇది నిజం. ఏ హీరో అయినా అభిమానులను ఇష్టపడాలి. ఇలా చులకనగా చూడకూడదు. హిట్లు, ప్లాపులు చాలా వస్తాయి.
కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్న విషయం మర్చిపోకూడదు. ఈరోజు నేను సొంతంగా కష్టపడి వచ్చానని చెప్పుకుంటున్న అల్లు అర్జున్ ఆనాడు మెగాస్టార్ లేకపోతే అసలు అతను ఎక్కడుండేవాడో. మనం కూడా అతనికి, మెగా ఫ్యామిలీకి సంబంధం లేదని అనుకుని ఉంటే, ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు. లోపల ఇగో ఫీలింగ్ ఉంది. దాన్ని పక్కన పెట్టుకుంటే ఆయన కూడా బాగుండేవాడు. పుష్ప 2 ఇప్పటికే 6 నెలలు వాయిదా పడింది. ఇంకో 6 నెలలు వాయిదా పడుతుంది. మెగా ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది'. అంటూ సాయి బాబా సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
(video link credits to anantha tv entertainment youtube id)