Ram Charan: తండ్రి కాబోతున్న విషయం మొదట ఆయనకే చెప్పానంటున్న.. రామ్ చరణ్

by Prasanna |
Ram Charan: తండ్రి కాబోతున్న విషయం మొదట ఆయనకే చెప్పానంటున్న.. రామ్ చరణ్
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ సహనటుడు ఎన్‌టీఆర్‌తో తనకున్న స్నేహం ఎంతటి విలువైందో చెప్పాడు. రీసెంట్‌గా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్వూలో తండ్రి కాబోతున్న విషయంతోపాటు తారక్‌తో ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుతూ.. 'తారక్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. అన్ని విషయాలు మొహమాటం లేకుండా షేర్ చేసుకుంటాం. నేను తండ్రి కాబోతున్న సంగతి సోషల్ మీడియాలో ప్రకటించే ముందు తారక్‌కు ఫోన్ చేసి ఆనందక్షణాలను పంచుకున్నా. దీంతో 'మెగా ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. నీకు పిల్లలంటే చాలా ఇష్టం. నీ పిల్లలు నీతో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు' అంటూ సంబరపడిపోయాడు. అలాగే ఈ గుడ్ న్యూస్ తెలిసిన తర్వాత మా అమ్మానాన్న, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యారు' అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు చెర్రీ.

Advertisement

Next Story