- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను చచ్చాక కూడా మీ సానుభూతి అక్కర్లేదు.. స్టార్ హీరో సంచలన కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతనికి బ్యాడ్ టైమ్ నడుస్తున్నదనే చెప్పాలి. ఈయన చేసే ప్రతి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖేల్ ఖేల్ మే’(khel khel mein) అనే మూవీ ఆగస్టు 15 న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన కెరీర్‌లోని పరాజయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అక్షయ్ మాట్లాడుతూ.. “కొంత కాలం నుంచి నా సినిమాలు వరుసగా ప్లాప్‌లు అవుతున్నాయి. దాంతో కొంత మంది మీరేమి బాధపడకండి అంతా సర్దుకుంటుంది. మళ్ళీ మీరు కమ్ బ్యాక్ ఇస్తారు అంటు సానుభూతితో మెసేజ్ చేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. నా మీద సానుభూతి చూపించకండి నేనేమి చనిపోలేదు. అసలు కమ్ బ్యాక్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా! ఇక్కడే ఉన్నాను ఇప్పుడున్న విధానంగానే నా పనిని కొనసాగిస్తూ ఉంటానని చెప్పాడు.
అదే విధంగా ఇప్పటికి వరకు నేనేదైతే సంపాదించానో అదంతా నా స్వార్జితం. సో చివరి వరకు కూడా ఇండస్ట్రీ లోనే ఉంటాను” అని అక్షయ్ కుమార్ తెలిపాడు. కాగా ముదాసర్ అజీజ్ డైరెక్షన్‌లో.. టి సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ మూవీలో తాప్సీ, ప్రజ్ఞ జైస్వాల్, వాణి కపూర్, ఫరీద్ ఖాన్, అమ్మి విర్క్ , ఆదిత్య సీల్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.