Hero Nani: హడావిడి చేయడం నాకు నచ్చదు.. నిదానమే ప్రధానం అంటున్న హీరో నాని

by Prasanna |
Hero Nani: హడావిడి చేయడం నాకు నచ్చదు.. నిదానమే ప్రధానం అంటున్న హీరో  నాని
X

దిశ, సినిమా : హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా మన పెద్ద వాళ్ళు నిదానమే ప్రధానమని దేనికైనా ఓపిక, సహనం ఉండాలని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. ప్రస్తుతం నాని కూడా అదే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా తీసే ఎవరైనా కొంచమైనా టెన్షన్ పడతారు.. కానీ నానీ మాత్రం హడావిడి లేకుండా చాలా కూల్ గా ఉన్నాడు.

అలాగని సైలెంట్ గా లేడు.. మార్కెట్ కోసం సపరేట్‌గా ఓ ప్లాన్ ఫాలో అవుతునన్నట్టు తెలుస్తుంది. కరోనాకు ముందు వరకు పాన్ ఒక ఆప్షన్ కానీ, ఇప్పుడు చాలా అవసరం.. ముందు ముందు ఇదే నడుస్తుంది. అందుకే స్టార్ హీరోలంతా అటు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభాస్, యశ్ అయితే ఒక్క రోజు లోనే ఇండియన్ హీరోలైపోరు.

అయితే, నాని మాత్రం ముందు శ్యామ్ సింగరాయ్‌తో మొదటి సారి పాన్ ఇండియ స్టార్ కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్నకి మళ్ళీ అదే ఫాలో అయ్యాడు. మధ్యలో అంటే కొంచం టైం తీసుకుని సుందరానికి సినిమాను సౌత్‌లోనే రిలీజ్ చేసారు. ఇక తాజాగా సరిపోదా శనివారం మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. సరైన సక్సెస్ కొట్టి పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకోవాలని నాని చూస్తున్నాడు. దాని కోసమే హడావిడి చేయకుండా.. నిదానమే ప్రధానమని నాని అంటున్నాడు. మరి నాని కోరుకున్నట్టు జరుగుతుందో లేదో చూడాలి.

Advertisement

Next Story