అతనితో డేటింగ్ అస్సలు బోర్ కొట్టలేదు: Namrata

by Prasanna |   ( Updated:2022-12-23 09:39:38.0  )
అతనితో డేటింగ్ అస్సలు బోర్ కొట్టలేదు: Namrata
X

దిశ, సినిమా : మహేష్ బాబు- నమ్రత ప్రేమ పెళ్లి విషయం గురించి అందరికీ తెలిసిందే. మోడలింగ్‌గా కెరీర్ మొదలుపెట్టిన నమ్రత 'వంశీ' సినిమాలో మహేష్‌తో కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఓ నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నమ్రత తమ డేటింగ్ గురించి ఓపెన్ అయింది. నార్త్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణంలో ఎలా సెట్ అయ్యారు ? అని ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాధానం చెబుతూ..'మహేష్‌తో డేటింగ్‌ చేస్తున్నపుడు తన సినిమా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. షూటింగ్ పూర్తికాగానే అతనితో కలిసి సంతోషంగా గడిపేదాన్ని. అతనితో పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నపుడు ఎన్నడూ బోర్ కొట్టలేదు'అంటూ తమ అందమైన క్షణాలను గుర్తుచేసుకుంది.

రోడ్డుపైనే నా చీర లాగి చిత్రహింసలు పెట్టాడు : కరాటే కళ్యాణి

Advertisement

Next Story

Most Viewed