- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తారక్ కోసమే ఆ పని చేశాను.. కాజల్ కామెంట్స్ వైరల్!
దిశ, సినిమా : అందాల చందమామ కాజల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. లక్ష్మీ కళ్యాణ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడి.. కొన్ని రోజుల తర్వాత వీరు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వివాహం తర్వాత కూడా ఈ చిన్నది సినిమాల్లో నటించింది. తర్వాత కొన్ని రోజులకు నీల్ కుచ్లూకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ప్రేమ, పెళ్లి, కెరీర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సత్యభామ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ ఆలితో సరదగా అనే కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చింది. అందులో ఆలీ పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గౌతమ్ ఏమైనా రూల్ పెట్టాడా అని అడగ్గా.. అలాంటిది ఏమి లేదు. నేను చాలా రోజుల నుంచి యాక్షన్ తరహాల విలన్స్‌ను కొట్టే పాత్రలు చేయాలని అనుకుంటున్నాను.. అందులో భాగంగానే సత్యభామను ఓకే చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా..బ్యానర్, పెద్ద డైరెక్టర్, రెమ్యునరేషన్ గురించి ఆలోచించి ఐటెంసాంగ్ చేయలేదని, కేవలం తారక్ కోసమే ఆ ఐటమ్ సాంగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read More...