టీనేజ్‌లో చాలా తప్పులు చేశా.. అమ్మనాన్నకు సారీ: ‘BRO’ ప్రమోషన్‌లో ప్రియా

by Anjali |   ( Updated:2023-07-21 10:57:31.0  )
టీనేజ్‌లో చాలా తప్పులు చేశా.. అమ్మనాన్నకు సారీ: ‘BRO’ ప్రమోషన్‌లో ప్రియా
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ‘బ్రో’ సినిమాలో అవకాశం రావడంపై హ్యాపీగా ఫీల్ అవుతోంది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రియా.. ‘‘బ్రో’ ఆఫర్‌ వచ్చినప్పుడు నిజంగా నేను నమ్మలేదు. మొదటి రోజు సెట్‌లో పవన్‌ కల్యాణ్‌‌ను చూసి చాలా సంతోషించా. అదే సమయంలో కంగారు పడ్డాను. ఆయన ప్రశాంతంగా ఉంటారు. సాయి చాలా ఫ్రెండ్లీ. వాళ్లిద్దరితో నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది’ అని చెప్పింది. అలాగే మీరు సారీ, థ్యాంక్స్‌ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు? అని విలేఖరి ప్రశ్నించగా.. ‘రెండూ నా తల్లిదండ్రులకే. వాళ్ల సపోర్టుతోనే ఈ స్థాయిలో ఉన్నాను. వాళ్లకు నచ్చకపోయినా టీనేజ్‌లో ఎన్నో ఆకతాయి పనులు చేశా. అప్పుడు చేసిన పనులన్నింటికీ ఇప్పుడు సారీ చెప్తున్నా. అమ్మనాన్నలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ పేరెంట్స్‌ గురించి గొప్పగా చెప్పింది.

Read more : disha newspaper

Movie News & Gossips


Next Story