ఆ రోజు రాజశేఖర్ చేసిన పనికి చాలా ఏడ్చాను : జీవిత‌ రాజ‌శేఖ‌ర్

by samatah |   ( Updated:2023-04-06 14:08:16.0  )
ఆ రోజు రాజశేఖర్ చేసిన పనికి చాలా ఏడ్చాను : జీవిత‌ రాజ‌శేఖ‌ర్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో జీవిత‌ రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు ప్రత్యేక‌మైన స్థానం ఉంది. కెరీర్ ప్రారంభంలో ఇద్దరూ క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. ఆ సినీ ప్రయాణంలో మొదలైన ప్రేమ, తర్వాత పెళ్లి, ఇప్పుడు వారిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు. వారు కూడా హీరోయిన్‌లుగా సెటిల్ అవుతున్నారు. ఇక మొత్తంగా వీరి దాంపత్య జీవితం చాలా సజావుగా గడుస్తుంది. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట వారీ పాతికేళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు.

ఈ క్రమంలో జీవిత మాట్లాడుతూ ‘నేను ముందుగా రాజ‌శేఖ‌ర్‌‌ను ప్రేమించాను. ఈ విషయం తెలిసి ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్రరావు నన్ను పిలిచారు. రాజ‌శేఖ‌ర్ విల‌న్‌లా ఉన్నాడు. న‌మ్మకు జీవిత అని స‌ల‌హా ఇచ్చారు. కానీ రాజ‌శేఖ‌ర్‌లో ఫ్రాంక్ నెస్ నాకు న‌చ్చింద‌ని చేప్పాను. శేఖర్‌ను పెళ్లికి ఒప్పించడానికి చాలా కష్టాలు పడ్డాను. ఒకసారి తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్ వినిపించింది. దీంతో బాధనిపించింది. అప్పుడు శేఖర్ దగ్గర అంబాసిడ‌ర్ కారు ఉండేది. ఓ రోజు డ్రైవింగ్ సీట్లో రాజ‌శేఖ‌ర్‌, ప‌క్క సీట్లో ఆయ‌న పెళ్లి చేసుకోవాల‌నుకున్న అమ్మాయి వెనుక సీట్‌లో నేను కూర్చున్నా. తన పక్కన ఆ అమ్మాయి కూర్చుంటే తట్టు కోలేకపోయాను. ఏడ్చేశాను’ అంటూ పలు విషయాలు గుర్తుచేసుకుంది.

Read More: రాజశేఖర్‌ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత.. తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లి అలా చేసిందా?

Advertisement

Next Story