నా భర్త ఆ పని చేయడం కోసం చింపాంజీలా ఎదురుచూస్తానంటూ అనసూయ ఆసక్తికర పోస్ట్

by Hamsa |   ( Updated:2024-03-05 10:00:42.0  )
నా భర్త ఆ పని చేయడం కోసం చింపాంజీలా ఎదురుచూస్తానంటూ అనసూయ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్‌గా పరిచయం అయిన అనసూయ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూనే వరుస చిత్రాలతో అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒక్కోసారి తనను ట్రోల్స్ చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే.. అభిమానులు అడిగింది చేస్తుంది. అయితే కొంత కాలంగా మాత్రం అనసూయ వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా మారింది. దీంతో వివాదాస్పద కామెంట్స్‌కు దూరమైంది.

కానీ సినిమా అప్డేట్స్ ఇస్తూ పలు పోస్టులు చేస్తుంది. మరీ ముఖ్యంగా భర్త సుశాంక్, తన కొడుకులతో వెకేషన్స్‌కు వెల్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనసూయ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఏదైనా పనిలో నాకు ఎలాంటి సహాయం అవసరం లేదని ముందే ఆయనకు చెప్పినప్పటికీ నా భర్త నాకు సహాయం చేస్తారని నేను ఎదురుచూస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా వెయిట్ చేస్తున్న చింపాంజీ వీడియోను షేర్ చేసింది. అంటే దాంతో ఆమెను పోల్చుకుందన్న మాట. ఇక ఈ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ నిన్ను చింపాంజీతో పోల్చుకోవడం ఏంటీ? మరేది దొరకలేదా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

పెళ్లయ్యాక మొదటిసారి భర్తతో కలిసి స్టెప్పులేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఇన్‌స్టా రీల్ వైరల్ 




Advertisement

Next Story

Most Viewed