- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను అలాంటి దాన్ని కాదు! రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందనాకు 'పుష్ప' సినిమా తర్వాత వచ్చిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం రష్మి్క వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు తో పాటు కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
''నేను సాధారణంగా ఫ్రెండ్‌షిప్ డే, హగ్ డే, చాక్లెట్ డే లేదా వాలెంటైన్స్ డేని చాలా సీరియస్‌గా తీసుకుని స్పందించే రకం కాదు. అంతే కాకుండా నా వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా బయట పెట్టే రకాన్ని కాదు. ఇప్పుడు షేర్ చేసిన ఫొటోల్లో ఉన్న వారు (కొందరు మిస్ అయ్యారు). . వారికి కూడా ఆశ్చర్యమే! కానీ ఇప్పుడు నా జీవితంలో ఈ వ్యక్తులు ఎంత ముఖ్యమైనవారో చెప్పదల్చుకున్నాను.. వాళ్లు లేకపోతే నేను ఈ రోజు ఉండేదాన్ని కాదు..
కొందరితో నేను కలిసి పెరిగాను.. మరి కొందరితో కలిసి పని చేశాను. ఇందులో కొందరితో నేను ఎక్కువగా టచ్‌లో ఉండను. కానీ, నా మనసులో వారికి చాలా ప్రాధాన్యం ఉంది. వారంతా కూడా ఎప్పుడూ నాకు ప్రత్యేకంగా ఉంటారు! మీమ్మల్ని ఎప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మీ నుండి వచ్చిన ఏ సందేశం అయినా నా చిరునవ్వుకు కారణం అవుతుంది. మీ నుండి వచ్చే ఫోన్ కాల్స్ నాకు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఇలా ఉండటానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు. నా మనసులో మీ అందరికీ చోటు ఉంది''. అంటూ చెప్పకొచ్చింది. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సమంతకు మరో అవకాశం.. టాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న బ్యూటీ ?
రూ. 10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయన్.. నిర్మాతల మనసులో!