- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను తెలివైన అమ్మాయిని కాబట్టి సైబర్ మోసాన్ని తిప్పి కొట్టాను.. నటి వీడియో వైరల్
దిశ, సినిమా: ‘కార్తీక దీపం’ ఫేమ్ శోభాశెట్టి (మౌనిత) గురించి తెలిసిందే. తన యాక్టింగ్‌తో, విలనిజంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. గతేడాది బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్‌లో ఉన్న వాళ్లను ముప్పతిప్పలు పెట్టిన ఈ అమ్మడు ఇంకో రెండు వారాలు ఉందనగా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు సైబర్ నేరగాళ్లకు చిక్కొద్దు అంటూ ఓ వీడియో షేర్ చేసింది.
వీడియోలో ఉన్న దాని బట్టి.. శోభా శెట్టికి ఓ కాల్ వస్తుంది. ‘హాయ్.. మేము ఫైబర్ నెట్ కంపెనీ నుంచి కాల్ చేస్తు్న్నాం. మీ బిల్ డ్యూ ఉంది. వెంటనే పే చెయ్యకపోతే మీ సర్వే డిస్కనెట్ చేస్తాము. మీకు వెంటనే ఓ లింక్ పింపిస్తా అది క్లిక్ చేసి అమౌంట్ పంపండి’ అని చెప్తాడు. అయితే.. శోభా శెట్టి నాకు ఎలాంటి ఇన్ఫర్‌మేషన్ రాలేదు. నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మాట్లడతా అని కొంచెం గట్టిగా మాట్లాడేసరికి కాల్ కట్ అవుతోంది. అయితే.. ఇది స్క్రిప్‌టెడ్ అయినప్పటికీ మాక్సిమమ్ రోజు వందల్లో ఇలాంటివే జరుగుతున్నాయి. చాలా మంది తెలియక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి.. వారు పంపించిన లింక్‌లు ఓపెన్ చేసి మోసపోతున్నారు.
దీనిపై అవగాహనగా శోభాశెట్టి ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘తెలివిగా ఉండేందుకు ప్రయత్నించాడు. నేను తెలివైన అమ్మాయిని అని అతనికి చూపించాను! UPI మనకు తెలియని యాప్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్ చేయవద్దని, ధృవీకరించని మూలాల నుండి లింక్‌లపై క్లిక్ చేయవద్దని చెబుతుంది. కస్టమర్ సర్వీస్ కాల్‌ల ప్రామాణికతను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. అంతే కాకుండా అధికారిక ఛానెల్‌లలో మాత్రమే చెల్లింపులు చేయండి. నకిలీ బిల్లు చెల్లింపు కాల్‌లు/sms కోసం పడకండి’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతోంది.