ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇన్ని రోజులకు రోజాపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇన్ని రోజులకు రోజాపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : హైపర్ ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే, జబర్దస్త్‌లో అదిరిపోయే పంచ్‌లు వేసి, ఈయన మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.ఇక ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అన్నవిషయం తెలిసిందే. దీంతో ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం గట్టిగా ప్రచారం చేశాడు. అంతేకాకుండా పలు సార్లు నటి రోజా పై పరోక్షంగా సెటైర్లు కూడా వేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆది తన సినిమాల పరంగా బిజీ అయిపోయి, రాజకీయాల వైపు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు.

కానీ తాజాగా ఈయన రోజాపై మొదటి సారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదికి రోజాపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురు కాగా, ఆయన మాట్లాడుతూ రోజాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఎక్కువ ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి, ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే ఉంటుంది. నాకు ఇంత పేరు రావడానికి కూడా కారణం ఆమె, ఆమెపై నాకు మంచి రెస్పెక్ట్ ఉంటుందని తెలిపాడు. ఇక ప్రస్తుతం ఆది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story