ALLU ARJUN : అల్లు అర్జున్‌కు హైపర్ ఆది సపోర్ట్.. ఇక ఆపేయాలంటూ కామెంట్స్!

by Jakkula Samataha |
ALLU ARJUN : అల్లు అర్జున్‌కు హైపర్ ఆది సపోర్ట్.. ఇక ఆపేయాలంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు వచ్చాయి. రెండు ఫామిలీస్ మధ్య ఎలాంటి మాటలు లేవు, దీనికి కారణం అల్లు అర్జునే అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌ను కాదని, వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం, దీనిపై నాగబాబు స్పందిస్తూ.. వాడు మనోడే కానీ పరాయి వాడు అంటూ కామెంట్స్ చేయడం ఇదంతా నెట్టింట్లో పెద్ద చర్చే జరిగింది. అలాగే, పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్‌కు అల్లు ఫ్యామిలీ వెళ్లకపోవడం, ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా వీరు కనిపించకపోవడంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు, అల్లు అర్జున్ వల్లనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ విడిపోయింది అంటూ బన్నీపై తెగ ట్రోలింగ్ జరుగుతుంది. కాగా, దీనిపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందిస్తూ.. అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు.

అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే. మెగా ఫ్యామిలీలోని హీరోలకు, పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, వారంతా ఒక్కటే, జాతీయ అవార్డు అందుకున్న బన్నీని కొంతమంది కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా ట్రోల్ చేయడం ఆపండి, ఎప్పుడూ ఈ రెండు ఫ్యామిలీస్‌పై ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటారు. నిజానికి అది వివాదం కాదు అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed