ఆ రోజే దానితో ప్రేమలో పడ్డాను: Huma Qureshi

by Mahesh |   ( Updated:2022-12-25 11:22:33.0  )
ఆ రోజే దానితో ప్రేమలో పడ్డాను: Huma Qureshi
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి తన పదేళ్ల నటన జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాదు ఫ్యామిలీలో తననే తెలివైన బిడ్డగా అందరూ భావించేవారని, దీంతో ఎడ్యుకేషన్ విషయంలోనూ చాలా సపోర్ట్ చేసినట్లు తెలిపింది. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విద్య పరంగా నేను గొప్ప స్థాయికి ఎదుగుతాననుకున్నారు. కానీ, వాళ్లందరినీ నిరుత్సాహపరిచాను. అలాగే కళాశాలలో 'మహాభారత మహిళలు' అనే నాటకంతోనే నటనతో ప్రేమలో పడ్డాను. ఆ నాటికలో నటించడంతో పాటు దానికి దర్శకత్వం కూడా వహించాను. ఆ రోజుతోనే నా నటన ప్రయాణం ప్రారంభమైనట్లు భావించాను. నా ప్రతిభను మెచ్చిన ప్రేక్షకుల చప్పట్లు, ప్రశంసలే ఇటువైపు ఆకర్షించేలా చేశాయి. అప్పటి నుంచి ఎలాగైనా గొప్ప యాక్టర్ కావాలని కుస్తీ పడ్డాను. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను' అంటూ హ్యూమా చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : ఆ ప్రత్యేక అనుభూతిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది: Niti Taylor

Advertisement

Next Story