వివాదాల్లో Hrithik Roshan జొమాటో యాడ్..

by Hamsa |   ( Updated:2022-08-22 07:19:26.0  )
వివాదాల్లో Hrithik Roshan జొమాటో యాడ్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హృతిక్ రోషన్ జొమాటో యాడ్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో హృతిక్ 'మహాకాళ్ నుంచి జొమాటోలో థాలిని తెప్పించుకుని తినేస్తా' అనే మాటలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మహాకాళ్ అనే పదాన్ని వాడటంపై మధ్యప్రదేశ్ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతేగాకుండా సోషల్ మీడియా ద్వారా చాలామంది నెటిజన్లు ఈ యాడ్‌ను బైకాట్ చేయాలని ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో హృతిక్ యాడ్‌ను తొలగిస్తునట్లు జొమాటో సంస్థ ప్రకటించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చింది.

జోమాటో వినియోగాదారులకు షాక్.. ఇకపై ఆ సేవలు బంద్

Advertisement

Next Story