ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన హృతిక్ రోషన్.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేశారుగా!

by Hamsa |
ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన హృతిక్ రోషన్.. పోస్ట్‌తో హింట్ ఇచ్చేశారుగా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రజెంట్ ‘వార్-2’ మూవీతో రాబోతున్నాడు. ఇక హృతిక రోషన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే షబా ఆజాద్‌తో గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయంలో తెలిసిందే.

వీరిద్దరు పలు మార్లు తమ బంధం గురించి కూడా వెల్లడించారు. కానీ పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ ఆయన పెళ్లి గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, షబా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్‌తో అందరిలో అనుమానాలను పుట్టించింది. ‘రివీలింగ్ సూన్’ అని రాసుకొచ్చింది. దానికి హృతిక్ రోషన్ ‘‘ఆగలేకపోతున్నాను’’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ రెండు పోస్టులు చూసిన నెటిజన్లు పెళ్లి గురించే హింట్ ఇచ్చారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

కానీ ఫ్యాన్స్ మాత్రం ఏదైనా సినిమా గురించి కావొచ్చు అని అంటున్నారు. కాగా, హృతిక రోషన్ 2000లో సుస్సానే ఖాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య 2014లో విడాకులు తీసుకుని విడిపోయాడు. ఇక అప్పటి నుంచి హృతిక్ రోషన్-షబాతో రిలేషన్‌లో ఉంటున్నాడు. అయితే వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఈ పోస్టులు పెట్టారని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

(Video Link Credits To Saba Azad Instagram Channel)

Advertisement

Next Story