ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కబోతున్న హృతిక్-సబా అజాద్? నెట్టింట న్యూస్ వైరల్

by sudharani |   ( Updated:2023-07-06 12:07:32.0  )
ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కబోతున్న హృతిక్-సబా అజాద్? నెట్టింట న్యూస్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సింగర్ సబా అజాద్‌ తమ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జోడి.. మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వీళ్ల పెళ్లికి సంబంధించి ఇరువురి కుటుంబాలు చర్చించుకున్నట్లు తెలుస్తుండగా.. మ్యారేజ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక 2004లో సుస్సానే ఖాన్‌ను హృతిక్ మ్యారేజ్ చేసుకోగా 10 సంవత్సరాల తర్వాత 2014లో వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అలాగే వీరిద్దరికీ హృదాన్, హ్రేహాన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కెరీర్ విషయానికొస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘ఫైటర్’తోపాటు ‘టైగర్ 3’లో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు హృతిక్.


Advertisement

Next Story