Mahesh Babu - SS Rajamouli సినిమాలో హాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న అదిరిపోయే స్కెచ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-17 07:27:46.0  )
Mahesh Babu - SS Rajamouli సినిమాలో హాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న అదిరిపోయే స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు చిత్రానికి హాలీవుడ్ స్థాయిని దర్శకుడు రాజమౌళి తీసుకువచ్చారు. అయితే రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. SSMB 29 కోసం జక్కన్న అదిరిపోయే స్కెచ్ వేశారు. మహేష్ సరసన ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమాపై ఆసక్తి నెలకొంది. మహేష్ బాబుతో తన తదుపరి సినిమా ఉంటుందని ఇప్పటికే ఆయన అనౌన్స్ చేశారు.

ఇందుకు సంబంధించి కథను కూడా ఆయన రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పాన్ ఇండియా రైటర్ తండ్రి విజయేంద్రప్రసాద్ తో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తైతే ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోందని టాక్. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో పాటు టెక్నిషియన్స్ తో ఆయన చేతులు కలపబోతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ(సీఏఏ) తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటించడానికి ఒప్పిస్తోంది. ఈ సినిమాలో థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.

Read more:

ముంబై ఆడవాళ్లే కావాలా? మేము పనికిరామా?

Advertisement

Next Story

Most Viewed