- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
NTR: ఎన్టీఆర్ ఇంట్లో అలా ఉంటారంటూ షాకింగ్ విషయాలు రివీల్ చేసిన ఆయన బావమరిది!
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోల్లో భారీ ఫ్యాలోయింగ్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ ఏకంగా ఆస్కార్ అవార్డులు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ రావడంతో పాటు గ్లోబల్ స్టార్ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజెంట్ తారక్ కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుండటంతో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ బావమరిది యంగ్ హీరో నార్కే నితిన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఖాళీగా ఉంటే కచ్చితంగా మా బావ ఎన్టీఆర్ ఇంటికే వెళ్తాను. అయితే ఆయన బయటకు గంభీరంగా కనిపించినా కానీ అస్సలు అలా ఉండరు. ఇంట్లో చాలా జోవియల్‌గా ఉంటారు. అంతేకాకుండా ఆయన పక్కన ఉన్న వాళ్లను సంతోష పెడతారు ఫుల్లుగా జోక్స్ చెప్పి నవ్విస్తారు. అందరితో చాలా తొందరగా కలిపోతారు. ఆయన ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్లకి వంట కూడా చేసి పెడతారు. ముఖ్యంగా ఎన్టీఆర్ హలీమ్, బిర్యాని వంటి స్పెషల్ వంటలు సూపర్‌గా వండుతారు.
అలాగే అందరూ కూర్చుంటే ఆయన మాత్రం వడ్డించి వారు తింటుంటే సంతోష పడతారు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నార్కే నితిన్ ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాడు. అయితే ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టింది. ప్రజెంట్ ఈ యంగ్ హీరో శ్రీశ్రీశ్రీ రాజవారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తుండగా.. సంపద హీరోయిన్‌గా నటిస్తుంది.
- Tags
- NTR
- Narke Nithin