Highest paid actors : సౌత్ హీరోల్లో వీళ్లే తోపులు.. ఒక్కో మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..

by Javid Pasha |
Highest paid actors : సౌత్ హీరోల్లో వీళ్లే తోపులు.. ఒక్కో మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..
X

దిశ, సినిమా : ఒకప్పుడు సినిమాలంటే అవీ.. హీరోలంటే వాళ్లు.. అని బాలీవుడ్ మూవీస్ అండ్ యాక్టర్స్ గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే ఆ సినిమాల్లో కథా కథనాలు, నటనా వైభవాలు, సంగీత మాధుర్యాలు మనస్సును హత్తుకున్నంతగా అదర్ లాంగ్వేజెస్‌లోని మూవీస్‌లో ఆకట్టుకోవని కొందరు భావించేవారు. ఇక డిమాండ్‌ను బట్టి అక్కడి నటీ నటులు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకునేవారు. దీంతో వాళ్లకు మించిన తోపులు లేరనుకునేవారు కొందరు సినీ ప్రేక్షకులు. కానీ అదంతా గతం. ఇప్పుడలాంటి స్థిరమైన ఆలోచనలకు కాలం చెల్లింది.

ప్రజెంట్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తేడాలేకుండా అందరూ అన్ని రకాల సినిమాలతో అలరిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో అగ్రనటులు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో తమ సత్తా చాటుతూ వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక రెమ్యునరేషన్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు.

ఇకపోతే సౌత్ ఇండస్ట్రీలో తోపులెవరు? బాలీవుడ్ హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మన టాలీవుడ్ హీరోలు ఎవరు? అనే అంశంపై పలువురు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీకి ఆస్కార్ తర్వాత తెలుగు సినిమాల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలు కూడా వరల్డ్‌వైడ్ పాపులర్ అవుతున్నాయి. అదే సందర్భంలో ఇక్కడి హీరోలు కూడా ఒక్కో సినిమాకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ -5 సౌత్ హీరోల్లో ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు, రజనీ కాంత్ ఒక్కో సినిమాకు రూ.110 కోట్ల నుంచి 120 కోట్ల వరకు, దళపతి విజయ్ రూ. 100 కోట్ల నుంచి రూ.115 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక తమిళ్ హీరో అజిత్ కుమార్ ఒక్కో మూవీకి రూ.130 కోట్ల వరకు, కమల్ హాసన్ రూ.100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. దీంతో నటనలోనే కాదు, రెమ్యునరేషన్‌లోనూ మన సౌత్ హీరోలు తోపులని, బాలీవుడ్‌తో పోటీ పడుతున్నారని పలువురు అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.



Next Story