తమ కెరీర్ కోసం హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారు.. నటి షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-06-02 13:16:08.0  )
తమ కెరీర్ కోసం హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారు.. నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈమె.. నిత్యం ఏదో ఒక కాంట్రవర్శీకి కారణమవుతుంది. హీరో డామినేషన్ నచ్చని కంగనా.. కథతో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో మహిళ పాత్రకు ప్రాముఖ్యం ఉన్న సినిమాలోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక బాలీవుడ్‌పై ఎప్పుడూ విరుచుకుపడుతుండే ఈమె.. నెపోటిజం, పురుషాధిక్యం, కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె హీరోయిన్లపై కాంట్రవర్శీ కామెంట్స్ చేసింది.

కంగనా మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో కొంత మంది ఏ-లిస్ట్ హీరోయిన్స్ ఉన్నారు. వారు ఉచితంగా యాక్టింగ్ చేస్తారు. స్టార్ మేకర్స్‌తో అందివచ్చిన అవకాశాలను, పాత్రలను దక్కించుకోకపోతే కెరీర్‌లో ఎదగడం కష్టం అవుతుందని దర్శకనిర్మాతలకు ఇతర మార్గాల్లో ఫేవర్ చేస్తుంటారు. తమ కెరీర్‌కు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారు’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read..

హుక్కా బార్‌లో పనిచేసిన సెక్సీ బ్యూటీ.. బంధించుకుని మరీ..

Advertisement

Next Story