- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియా కోచ్‌గా టాలీవుడ్ హీరోయిన్ భర్త.. కానీ ఎవరికి తెలియదంటూ నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: ఇటీవలే హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా వివాహం చేసుకుని ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. డెన్మార్మ్‌కు చెందిన మతియాస్ బోను పెళ్లి చేసుకుని.. అతడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తాప్సీ పెళ్లి విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ పారిస్ ఒలంపిక్స్‌లో సందడి చేస్తోంది. దగ్గరుండి మరీ భారత టీమ్ ను ప్రోత్సహిస్తుంది. ఇకపోతే రీసెంట్‌గా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన హస్బెండ్ మతియాస్ అంటే చాలా మందికి తెలియని వెల్లడించింది. ఈ విషయం కాస్త నన్ను బాధిస్తుందని, నేను పెళ్లి చేసుకున్నానని అధికారికంగా ప్రకటించాక కూడా ఆయన అంటే ఎవ్వరికీ తెలియదని చెప్పుకొచ్చింది.
తాప్సీ కూడా ఆయన గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పాలనుకోలేదని పేర్కొంది. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అంటూ మతియాస్ ఒక స్టార్ క్రికెటర్ అని నిజం బయటపెట్టింది. వరల్డ్ లోనే దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో మా ఆయన ఒకరని వెల్లడించింది. అలాగే ఒలింపిక్స్‌లో భారత జట్టు బ్యాడ్మింటన్ కోట్ అని తెలిపింది. తాప్సీ భర్త మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.ఈయన 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అలాగే 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012 మరియు 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.