నోరు మూసుకో.. హైపర్ ఆదికి హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

by Jakkula Samataha |
నోరు మూసుకో.. హైపర్ ఆదికి హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, సినిమా : హైపర్ ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈయన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకొని, ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్‌కు చాలా రోజుల క్రితమే గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ బుల్లితెరపై వచ్చే ఢీ షోలో మాత్రం ఆయన తన కామెడీతో అందరినీ నవ్విస్తూనే ఉంటున్నారు.

తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 మొదలైంది. అయితే ఈ ప్రోమోలో ఆది చేసిన కామెడీ అందరి నోట నవ్వులు పూయించింది. లేటేస్ట్‌గా విడుదలైన ఈ ఢీ షో ప్రోమోలో.. జడ్జీగా శేఖర్ మాస్టర్‌తో పాటు, బ్యూటీ హాన్సిక కూడా ఉన్నారు. ఈ బ్యూటీ ఇటీవలే వివాహ బంధం లోకి అడుగు పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఢీ షోకు జడ్జీగా చేయనుంది. అయితే ఈ క్రమంలో హాన్సిక, ఆది, శేఖర్ మాస్టర్‌పై వేసే సెటైర్స్ అందరినీ నవ్వించాయి. ఈ షోకు స్పెషల్ గెస్ట్‌గా సుధీర్ బాబు వచ్చారు. దీంతో ఆయనతో ఆది మాట్లాడుతూ.. మీరు ఎస్ ఎం ఎస్ సినిమా ఒకేసారి తీశారు కానీ, శేఖర్ మాస్టర్ ప్రతి రోజూ చేస్తారు అని సెటైర్ వేశారు. అంతటితో ఆగకుండా, మీరు ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి పారిపోతారు కానీ, శేఖర్ మాస్టర్‌ని చూసి దెయ్యమే పారిపోతుందంటూ ఆయనపై తెగ కామెంట్స్ చేశారు. ఇక ఇది విన్న హన్సిక.. హే ఆది నోరు మూసుకో అంటుంది. అప్పుడు ఆది గులిగినట్లు, నాలుగు రోజులు పోతే మీకే తెలుస్తుందని పంచ్ వేస్తారు. దానికి హన్సిక కౌంటర్ ఇస్తూ నాలుగు రోజులు ఎందుకు ఇప్పుడే పో అని చెప్తుంది. దీంతో అక్కడున్నవారందరూ నవ్వుతారు. ఈ ప్రో హైలెట్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed