- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న శ్రీలీల.. 2 కోట్ల నష్టం
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం పక్కకు నెట్టి.. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తుంది యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పదికి పైనే సినిమాలున్నాయి. రీసెంట్గా బాలయ్య ‘భగవంత్ కేసరి’ చిత్రంలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా.. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీ లీలను హీరోయిన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ పలు కారణాల వల్ల ఈ బ్యూటీ ఈ మూవీని రిజెక్ట్ చేసిందంటూ తాజాగా నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. విషయానికొస్తే.. శ్రీలీలను బోల్డ్ సీన్స్‌లో లిప్ లాక్ సీన్స్ చేయమంటూ ఇబ్బంది పెట్టారట.
స్క్రిప్ట్ స్టార్టింగ్‌లో ఆమెకు ఏ విధమైన సన్నివేశాలు చెప్పలేదట. తీరా సైన్ చేశాక బోల్డ్ సీన్స్‌లో చేయమంటూ ఫోర్స్ చేశారట. దీంతో శ్రీలీల ఈ మూవీ నుంచి తప్పుకుందట. అయితే రూల్స్ ప్రకారం సినిమా అగ్రిమెంట్‌పై సైన్ చేసిన తర్వాత హీరోయిన్ తప్పుకుంటే తీసుకున్న రెమ్యూనరేషన్లో సగం వెనక్కి ఇవ్వాల్సిందే. దీంతో చేసేదేం లేక శ్రీలీల రూ. 2 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందట. కానీ లిప్ లాక్ సీన్స్ మాత్రం చచ్చినా పెట్టను అంటూ తెగేసి చెప్పేసిందట. పాపం చేయని తప్పుకు శ్రీలీల శిక్ష అనుభవిస్తుందిగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలు నష్టపోయింది. అంటూ శ్రీలీల ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.