మహేష్ బాబు సపోర్ట్ వల్లే శ్రీలీలకు అన్ని సినిమా ఆఫర్లు వచ్చాయా..?

by Hamsa |   ( Updated:2023-03-06 08:02:18.0  )
మహేష్ బాబు సపోర్ట్ వల్లే శ్రీలీలకు అన్ని సినిమా ఆఫర్లు వచ్చాయా..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ ‘ధమాకా’ చిత్రంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసి దూసుకుపోతోంది. తాజాగా, శ్రీలీల కొద్ది సమయంలోనే ఫేమస్ అవ్వడానికి ఓ స్టార్ హీరో కారణమని వార్తలు వస్తున్నాయి. శ్రీ లీల వరుస సినిమాల్లో ఆఫర్లు రావడానికి మహేష్ బాబు కారణమట.

త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదట పూజా హెగ్డేను హారోయిన్‌గా తీసుకున్నారట. అయితే మరొక హీరోయిన్‌’ని కూడా తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట. ఈ క్రమంలో ఫ్యాన్స్ స్టార్ హీరోయిన్స్‌ను తీసుకుంటారు అనుకున్నారు. కానీ, శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాకుండా పూజా హెగ్డే‌కు ఈక్వల్‌గా శ్రీలీల పాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కాగా, మహేష్ బాబు వల్లే శ్రీలీలను చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలో హీరోయిన్‌గా కావాలని భావిస్తున్నారట. ఎందుకంటే మహేష్ బాబు అన్ని సినిమాల్లో స్టార్ హీరోయిన్లే ఉంటారు. కానీ, ఈ సారి అంద పెద్ద స్టార్ హీరో సినిమాలో యంగ్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవడంతో అందరీకి నమ్మకం ఏర్పడిందట.

ఇవి కూడా చదవండి : సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఖుషీ’ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్

Advertisement

Next Story