రాజకీయాల్లోకి రామ్ చరణ్ హీరోయిన్.. కన్ఫర్మ్ చేసిన కాంగ్రెస్ నేత!

by sudharani |   ( Updated:2024-03-23 14:23:10.0  )
రాజకీయాల్లోకి రామ్ చరణ్ హీరోయిన్.. కన్ఫర్మ్ చేసిన కాంగ్రెస్ నేత!
X

దిశ, సినిమా: హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీలో తన అందాలతో, యాటిట్యూడ్‌తో యువతను కట్టిపడేసింది ఈ బ్యూటీ. కానీ, ఈ క్రేజ్ ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయింది. చిరుత తర్వాత తెలుగులో కేవలం ‘కుర్రాడు’ సినిమాలో మాత్రమే నటించి.. అనంతరం టాలీవుడ్‌కు దూరమైన బాలీవుడ్‌, తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. అయితే నటనపరంగా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో స్టార్ డమ్ మాత్రం సొంతం చేసుకులేకపోయింది నేహా శర్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

నేహాశర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. బీహార్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నేహా శర్మ తండ్రి, కాంగ్రెస్ నేత అజిత్ శర్మ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ‘కాంగ్రెస్‌కు భాగల్‌పూర్‌ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.. ఒకవేళ ఈ సీటు కాంగ్రెస్ వస్తే.. నేను లేదా నా కుమార్తె నేహా శర్మ పోటీచేస్తుందని’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నేహా శర్మ పొలిటికల్ ఎంట్రీపై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed