లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్..?

by Harish |   ( Updated:2023-05-16 15:49:29.0  )
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్..?
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్త. కానీ దీనిపై ఇప్పటి వరకు వరుణ్ కానీ, లావణ్య కానీ స్పందించలేదు. నిహారిక పెళ్ళిలో కూడా లావణ్య బాగానే హడావుడి చేసింది కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. దాదాపు మ్యాటర్ పెళ్లి వరకు వచ్చినట్టు టాలీవుడ్ మీడియా టాక్. కాగా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్‌కు అయితే అంత సెట్ అయినట్టు, ఈ జూన్‌లో వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ గాసిప్ మాత్రం గట్టిగా వినపడుతుంది.

ఇవి కూడా చదవండి : సల్మాన్‌తో అక్రమ సంబంధం.. ఇంట్లోకి రానివ్వలేదన్న భాగ్యశ్రీ

Advertisement

Next Story

Most Viewed