షూటింగ్‌లో అఖిల్ హీరోయిన్‌‌కు గాయం.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-06-22 09:07:15.0  )
షూటింగ్‌లో అఖిల్ హీరోయిన్‌‌కు గాయం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ సోమన్ నాయర్ కూతురిగా స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తండ్రి ఒకప్పుడు నాగార్జునతో ‘నిర్ణయం’ అనే సినిమా తెరకెక్కించారు. ఆమె తల్లి కూడా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. అయితే కల్యాణి తెలుగులో అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఆంటోనీ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా,ఈ మూవీ యాక్షన్స్ సీక్వెన్స్ షూటింగ్‌లో కల్యాణికి గాయమైంది. ఆంటోనీ షూటింగ్ 29వ రోజు ఆ గాయం అయినట్లు సమాచారం. ఆ గాయాన్ని చూపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ‘‘స్టంట్లు బలహీనుల కోసం కాదు’’ కాదు అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన కల్యాణి ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story