Kanchana 4: రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్?

by Hamsa |   ( Updated:2024-09-12 15:03:13.0  )
Kanchana 4: రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్?
X

దిశ, సినిమా: డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అందరికీ సుపరిచితమే. ఆయన డైరెక్టర్‌గా వర్క్ చేయడంతో పాటు పలు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. అయితే రాఘవా నటించిన కాంచన మూడు పార్టులుగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంచన-4 రాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా ఈ మూవీ ఫిబ్రవరి 2025లో సెట్స్‌పైకి రానుంది టాక్. ఈ క్రమంలో.. నిర్మాత మనీశ్ షా రియాక్ట్ అయి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కించబోతున్నామని చెప్పడంతో అందరి దృష్టి ‘కాంచన-4’పై పడింది. తాజాగా, ‘కాంచన-4’లో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో రాఘవ లారెన్స్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే కాంచన-4 రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతున్నట్లు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు టాక్. అయితే త్వరలోనే కాంచన-4 షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందని తెలియడంతో ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు.

Advertisement

Next Story