కారు ఢీకొని స్టార్ హీరోయిన్‌కు తీవ్రగాయాలు.. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయం కోరుతున్న నటి!

by Anjali |   ( Updated:2024-03-18 10:13:17.0  )
కారు ఢీకొని స్టార్ హీరోయిన్‌కు తీవ్రగాయాలు.. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయం కోరుతున్న నటి!
X

దిశ, సినిమా: హీరోయిన్ అరుంధతి నాయర్ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూకు ఇచ్చి.. తన బ్రదర్ తో పాటు బైక్ పై వెళ్లోన్న క్రమంలో కారు వచ్చి వీరి బైక్ కు ఢీకొంది. దీంతో అరుంధతికి, ఆమె సోదరుడికి తీవ్ర గాయలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దని తిరువనంతపురంలో ఓ ప్రవేటు హాస్పిటల్ లో చేర్పించారు.

పరిస్థితి విషయంగా ఉండటంతో తోటి నటి గోపిక అనిల్.. అరుంధతి ఐసీయూలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మా వంతు సాయం చేస్తున్నాం. కానీ మనీ సరిపోవడం లేదు. మీ వంతు ఆర్థిక సాయం చేయండి అంటూ.. అరుంధతి బ్యాంక్ ఖాతా వివరాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు.

సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్ అరుంధతి 2014 లో పొంగు ఏజ్హు మనోహర అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత డోంట్ థింక్, పద్మిని అనే వెబ్ సిరీస్ ల్లో, పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక రీసెంట్ గా పోర్ కాసుకల్ మూవీలో నటించింది.

Read More..

అది కూడా నల్లగా ఉంటుందా అంటూ చండాలంగా మాట్లాడారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


Advertisement

Next Story
null