విక్రమ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్.. " తంగలాన్ " మూవీ నుంచి విక్రమ్ లుక్ రిలీజ్ !

by Prasanna |
విక్రమ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్..  తంగలాన్  మూవీ నుంచి విక్రమ్   లుక్  రిలీజ్ !
X

దిశ, సినిమా: సినిమాలో పాత్ర ఏదైనా సరే..ఎంతవరకైన వెళ్లగలిగే అతి కొద్ది మంది నటులలో, చియాన్ విక్రమ్ ఒకరు. తన కెరీర్‌లో ఇప్పటివరకు నటన పరంగా ఎన్నో ఐకానిక్ రోల్స్, గెటప్స్ వేసి అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ చేశారు. ఇక ఇటీవల విక్రమ్ నటించిన 'పొన్నియన్ సెల్వన్‌' సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా విక్రమ్ తన 61వ సినిమాకు 'తంగలాన్' అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు పారంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి లేటెస్ట్‌గా మరో వర్కింగ్ స్టిల్ వైరల్ అవుతుండగా..విక్రమ్ గెటప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మరోసారి విక్రమ్ నుంచి ఓ ఐకానిక్ రోల్‌ని ఆశించవచ్చు అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ మూవీతో విక్రమ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించనున్నాడో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed