బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాడైన శర్వానంద్.. ఫొటోలు వైరల్

by Hamsa |   ( Updated:2023-06-04 05:31:54.0  )
బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాడైన శర్వానంద్.. ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరి 26న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురు రక్షితతో నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 3న రాత్రి 11 గంటలకు జైపూర్‌లోని లీలా ప్రాలెస్‌లో శర్వానంద్, రక్షితల పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. శర్వా పెళ్లి వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇరువైపులా బంధువులు, సన్నిహితులు మధ్య పెళ్లి ఘనంగా జరిగింది. శర్వా, రక్షిత పెళ్లి ఫొటోలు బయటకు రానప్పటికీ వివాహానికి ముందు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More: Venu Thottempudi: నేడు వేణు తొట్టెంపూడి పుట్టిన రోజు

Advertisement

Next Story