పెళ్లైన వారానికే అలాంటి పని చేసిన హీరో శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి..!

by Hamsa |   ( Updated:2023-06-11 16:31:36.0  )
పెళ్లైన వారానికే అలాంటి పని చేసిన హీరో శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ జూన్ 3న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లాయర్ కూతురు రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జైపూర్ ప్యాలెస్‌లో జరిగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో రక్షిత రెడ్డికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. రక్షిత తండ్రి గట్టిగానే ఆస్తులను సంపాదించిపెట్టాడట. ఆమె పేరుపై పలుచోట్ల పొలాలు, స్థలాలు, ఇల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఆమెకు బిజినెస్‌లో కూడా మంచి పట్టు ఉందట. అంతేకాకుండా రక్షిత ఉద్యోగం చేసి నెలకు 12 లక్షలకు పైగానే సంపాదిస్తుందట. ఇకపోతే పెళ్లి తర్వాత రక్షిత ఉద్యోగం పూర్తిగా మానేసి టోటల్ లైఫ్‌ను ఫ్యామిలీకి కేటాయించాలని అనుకుందట. దీంతో ఈ విషయం తెలిసిన శర్వానంద్ ఫ్యాన్స్ వారం రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకుని మంచి పని చేసిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

నాగబాబు పెట్టిన కండీషన్‌కు లావణ్య త్రిపాఠి ఒప్పుకున్నాకే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?

Advertisement

Next Story