తండ్రి అడగుజాడల్లోను తను కూడా.. MaheshBabu కూతరుపై అభిమానుల ప్రశంసలు

by Prasanna |   ( Updated:2023-01-02 07:21:54.0  )
తండ్రి అడగుజాడల్లోను తను కూడా.. MaheshBabu కూతరుపై అభిమానుల ప్రశంసలు
X

దిశ, సినిమా : చిన్నారి సితార..తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. హీరో మహేశ్ బాబు కూతురుగా పాపులర్ అయిన ఈ చిన్నారి తాజాగా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే తండ్రిలాగే ఆ చిన్నారి కూడా తన దాచుకున్న మనీని నాన్న ఫౌండేషన్‌కు దొనేట్ చేసింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఘట్టమనేని వారసురాలు తాజాగా మరో మంచి పనిచేసి అభిమానులతో ప్రశంసలు అందుకుంటోంది. మహేశ్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు కూడా ఇక్కడే జరుపుకున్నది. చిన్నారులకోసం మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం మనకు సుపరిచితమే. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకొని మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం ఒక స్పెషల్ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ..మహేష్ ముద్దుల తనయ తమ ఫౌండేషన్ వీడియోను ట్వట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. ''http://maheshbabufoundation.org''కు సంబంధించిన అఫీసియల్ వెబ్‌‌సైట్‌ను లాంచ్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. నాన్న ఫౌండేషన్‌లో నేను కూడా భాగం కావాలనుకున్నా. ఇదే అవకాశంగా భావించి ఈ మంత్ నా దాచుకున్న మనీని డోనేట్ చేస్తున్నా. మీరు కూడా చేయండి. మనందరం చిన్న పిల్లలకు సాయం చేద్దాం'' అని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అభిమానులు మహేశ్ బాబుతోపాటు అతని ముద్దుల తనయ సితారపై 'తండ్రిలాగే కూతురు కూడా' అంటూ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story