- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raj Tarun: సినిమాల్లో హీరో.. బయట జీరో అసలు మ్యాటరే లేదంటున్న సంయుక్త సంచలనంగా మారిన వీడియో
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తనను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య పోలీసు కేసు కూడా పెట్టింది. అంతేకాకుండా యూట్యూబ్ చానల్లకు ఇంటర్వ్యూలో ఇచ్చి పలు సంచలన విషయాలు బయటపెట్టింది. మాల్వీ మల్హోత్రా వల్లనే అలా చేశాడని రచ్చ చేసింది. ఈ క్రమంలో.. రాజ్ తరుణ్ లావణ్యకు డబ్బులు ఇస్తానని కూడా చెప్పాడు. ఇటీవల కోర్ట్‌లో విచారణకు వెళ్లగా ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక రాజ్ తరుణ్ సినిమాల విషయానికొస్తే.. లావణ్య వివాదం జరుగుతున్నప్పుడే ఆయన నటించిన తిరగబడరసామి, పురుషోత్తముడు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భలే ఉన్నాడే సినిమా తొందరలో రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, రాజ్ తరుణ్ గురించి సంయుక్త అనే అమ్మాయి ముసుగు కట్టుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘అందరికీ నమస్కారం. టాలీవుడ్ హీరో గురించి గత కొద్ది రోజుల నుంచి వింటున్నాము కదా. నిజం చెప్పాలంటే అతనిలో మ్యాటరే లేదు. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక ఏడాది నుంచి నా ఫ్రెండ్ ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఉండటం ఏమో కానీ ఆ పిల్ల నాకు రోజు ఫోన్ చేసి ఏడుస్తుంది. ఆ పిల్ల అతను ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకున్నా కానీ అతను మాత్రం ముద్దు కూడా పెట్టడంట.
అయితే ఆ అమ్మాయి దగ్గరకు పోయినా కానీ దూరం వెళతాడట. 27 ఏళ్లకు పెళ్లి చేసుకుంటానని అన్నాడు. కానీ 30 ఏళ్లు వచ్చినా చేసుకోలేదు. ఇంకా పదేళ్లు వచ్చిన పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. కానీ సినిమాలు మాత్రం బాగానే చేసుకుంటుంటాడు. భలే ఉన్నాడులే అని. మనిషి చూడడానికి బాగానే ఉంటాడు. కానీ అతనిలో మ్యాటర్ ఏమీ లేదు. ఆయన సినిమాల్లోనే హీరో బయట జీరో. ఏదేమైనా సరే ఆగస్టు 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది కాబట్టి అన్ని ఫ్రూఫ్స్ చూపిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్ అని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇదేం ట్విస్ట్ నాయనా మూవీ ప్రమోషన్ల కోసం ఇలా కూడా చేస్తారా అని ట్రోల్ చేస్తున్నారు.
#RajTarun #BhaleUnnade ప్రమోషన్ కోసం రంగంలోకి దిగిన హిరోయిన్
— Rajesh Manne (@rajeshmanne1) August 18, 2024
రేపు ప్రూఫ్స్ తో చెప్తుందంట! pic.twitter.com/N1DrjWSa7V
- Tags
- Raj Tarun