పవిత్రపై ఆమె మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు.. ఆమెకు ఆ వ్యామోహం ఎక్కువంటూ..

by samatah |   ( Updated:2023-03-14 02:45:16.0  )
పవిత్రపై ఆమె మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు.. ఆమెకు ఆ వ్యామోహం ఎక్కువంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : పవిత్రా, నరేష్ గత కొన్ని రోజుల నుంచి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరిపై సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. కాగా ఎట్టకేలకు వాటికి చెక్ పెడుతూ పవిత్రాలోకేష్ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పవిత్ర నరేష్‌ తాము పెళ్లి చేసుకుంటున్లు ఓ వీడియోను రీలీజ్ చేసి, తాము ఒకటయ్యాం అంటూ ప్రకటించారు.

అయితే పవిత్ర లోకేష్ పై ఆమె మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర మొద‌ట కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకొని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మనిచ్చింది. ఆయనతో విభేదాలు రావడం అతనికి విడాకులిచ్చి, నరేష్‌తో తిరగడం ప్రారంభించింది.

అయితే సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె అవకాశవాది, విజయనిర్మల గారు సంపాదించిన రూ.1500కోట్లు ఆస్తినొక్కేసిందని తెలిపారు. నాదగ్గర డబ్బులు లేకపోవడంతో, నన్ను వదిలేసి నరేష్‌ను తగులుకుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమెకు డబ్బుపై వ్యామోహం ఎక్కువంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more:

Naresh Pavitra Lokesh: ఒక సెలబ్రెటీ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి సందేశాలా చెప్పేది? : ఫిల్మ్ క్రిటిక్

Advertisement

Next Story