చీరకట్టులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హెబ్బా పటేల్.. కుర్రాళ్ళు పడిచచ్చేది అందుకేనేమో!

by Anjali |   ( Updated:2024-03-01 11:27:33.0  )
చీరకట్టులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హెబ్బా పటేల్.. కుర్రాళ్ళు పడిచచ్చేది అందుకేనేమో!
X

దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో యూత్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ హెబ్బా పటేల్. ఎక్కడికి పోతావు రా చిన్నవాడా, ఈడోరకం, ఆడోరకం, రెడ్, మిస్టర్, అందగాడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫ్లాట్ టాక్ తెచ్చుకోవడంతో స్టార్ హీరోయిన్ లీగ్‌లో చేరుకోలేకపోయింది. ఇటీవల తెరకెక్కిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీలో నటించి ప్రేక్షకులను అలరించింది. డీగ్లామర్ పాత్రలో తన అద్భుతమైన నటనను కనబరిచింది.

సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో యువతను ఆగం చేస్తుంటుంది. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేటువంటి పిక్స్‌ను నెట్టింట పంచుకుంటూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటుంది. తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పంచుకుంది. బ్యూటీఫుల్ చీర కట్టుకుని.. జబ్బల జాకెట్ ధరించి.. కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరోవైపు గ్లామర్ విందులతో నెటిజన్ల మతులు చెడగొడుతోంది. మత్తెక్కించే ఫొటోలకు ఫోజులిచ్చిన హెబ్బా పటేల్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More..

సమంత సిగ్గు వదిలేసి ఆ పని చేస్తే, టాలీవుడ్‌లో టాప్ రేంజ్ పక్కానంట!

Advertisement

Next Story