అతడే నా సూపర్ స్టార్.. మనసులో మాట బయటపెట్టిన శ్రియ

by Aamani |   ( Updated:2023-03-16 08:20:40.0  )
అతడే నా సూపర్ స్టార్.. మనసులో మాట బయటపెట్టిన శ్రియ
X

దిశ, సినిమా : విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా, సాదాసీదా ఎలా ఉండాలో రజనీకాంత్‌ను చూసి నేర్చుకున్నానంటోంది శ్రియ. ఉపేంద్ర సరసన ఆమె నటించిన కన్నడ సినిమా ‘కబ్జ’ మార్చి 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘కబ్జ’ నా మనసుకు బాగా నచ్చిన చిత్రం. ఈ మూవీలో నాకు చాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు స్పెషల్ థాంక్స్. గతంలో సూపర్‌స్టార్‌ రజనీతో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ శంకర్‌కు మరోసారి కృతజ్ఞతలు. నిజానికి రజనీతో నటించే సమయంలో వ్యక్తిగతంగా చాలా విషయాలు నేర్చుకుంటాం. నేను కుడా విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా, సాదాసీదా ఎలా ఉండాలో ఆయన్ను చూసి నేర్చుకున్నా. అవకాశం దొరికితే రజనీతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నా. నాకు ఎప్పటికీ ఆయనే సూపర్‌స్టార్‌’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

మౌని‌కి చాలామందితో ఎఫైర్ ఉంది: ఉమైర్ సంధు

Advertisement

Next Story

Most Viewed